Sunday 17 November 2013

నిత్యామీనన్ తెలుగు తెరకు దొరికిన మరో సౌందర్య




‘‘నిత్యామీనన్ యాక్టింగ్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఆమె తెలుగు తెరకు పరిచయం కావడం మన అదృష్టం. నిత్యను తెలుగు సినిమాకు దొరికిన మరో సౌందర్య అనొచ్చు’’ అని విజయనిర్మల అన్నారు. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘మాలిని 22’. సీనియర్ నటి శ్రీప్రియ దర్శకత్వంలో రాజ్‌కుమార్ సేతుపతి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్-శంకర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 
  సూపర్‌స్టార్ కృష్ణ ఆడియోసీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని రానాకు అందించారు. ప్రచార చిత్రాలను విజయనిర్మల విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ -‘‘తెలుగులో లేడీ డెరైక్టర్లు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే లేడీ డెరైక్టర్ల సంఖ్య పెరుగుతోంది. శ్రీప్రియ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. నాటి తమ సహనటి శ్రీప్రియ దర్శకురాలిగా మారడం ఆనందంగా ఉందని జయసుధ చెప్పారు. చక్కని సందేశం ఉన్న సినిమా ఇదని సీనియర్‌నటి లత అన్నారు.
 
  నిత్యామీనన్‌ని లేడీ కమల్‌హాసన్‌గా నటుడు నరేష్ అభివర్ణించారు. ‘‘సమాజంలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. నిత్య నటన అద్భుతం’’ అని శ్రీప్రియ తెలిపారు. నిత్యామీనన్ మాట్లాడుతూ -‘‘సినిమా పట్ల శ్రీప్రియగారికున్న పేషన్, కన్విక్షన్ నచ్చి ఈ పాత్ర చేయడం కష్టమని తెలిసి కూడా చేయడానికి అంగీకరించాను. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. వాణిజ్య అంశాలతో పాటు, మంచి సందేశం కూడా ఉన్న సినిమా ఇది’’ అన్నారు. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇదని నిర్మాత రాజ్‌కుమార్ సేతుపతి నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వలపు ప్రయాణం




హైదరాబాద్, తిరుపతి మధ్య నడిచే అనేక ఎక్స్‌ప్రెస్‌లలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఒకటి. ఈ రైలులో వెళుతోన్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయి జీవితాన్ని ఈ ప్రయాణం ఏ విధంగా మలుపు తిప్పింది? వలపులూ ఆ మలుపులూ తెలియాలంటే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వచ్చేవరకూ ఆగాల్సిందే. సందీప్ కిషన్, రకుల్‌ప్రీత్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కిరణ్ నిర్మించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. రమణ గోగుల సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం’’ అని చెప్పారు. ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు.

Hero Surya Wallpapers




















"Atu Itu Ooguthu" Full Video Song - Life is Beautiful Movie


Vaana Video Song - Yeduta Nilichindi Choodu Song


ye maya chesave songs - vintunnavaa song - naga chaitanya, samantha


"Its Your Love" Full Video Song - Life is Beautiful Movie